1 Chronicles 16:27
ఘనతా ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. 2 బలం, సంతోషం ఆయన దగ్గర ఉన్నాయి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Glory and honour are in his presence; strength and gladness are in his place.
In Context
26జాతుల దేవుళ్ళన్నీ వట్టి విగ్రహాలే. 2 యెహోవా ఆకాశ వైశాల్యాన్ని సృష్టించినవాడు. 1
28జనాల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి. 2 మహిమను బలాన్నీ యెహోవాకు ఆపాదించండి. 1
Cross References
Nehemiah 8:10అప్పుడు నెహెమ్యా “బయలు దేరండి. కొవ్విన మాంసం తినండి. ఏదైనా తియ్యటిది తాగండి. ఇప్పటి దాకా తమ కోసం ఏమీ సిద్ధం చేసుకోని వాళ్లకు వాటాలు పంపించండి. ఎందుకంటే ఈ రోజు పరిశుద్ధమైనది. మీరు దుఃఖపడొద్దు. యెహోవాలో ఆనందమే మీ బలం” అని చెప్పాడు.
Psalms 16:11జీవమార్గం నువ్వు నాకు తెలియజేస్తావు. నీ సన్నిధిలో మహానందం ఉంది. నీ కుడిచేతిలో నిత్యానందం ఉంది.
Psalms 28:7యెహోవా నా బలం, నా డాలు. నా హృదయం ఆయనలో నమ్మిక ఉంచుతుంది గనక నాకు సహాయం కలిగింది. కాబట్టి, నా హృదయం ఉప్పొంగి పోతుంది. కీర్తనలతో నేను ఆయనను స్తుతిస్తున్నాను. 1
Psalms 63:2నీ బలాన్ని, నీ మహిమను చూడాలని పరిశుద్ధ మందిరంలో నీవైపు చూస్తూ కనిపెడుతున్నాను. 1
Ezekiel 1:27అప్పుడు ఒక ఆకారాన్ని నేను చూశాను. అతని నడుము పైగా అగ్నితో మండుతున్న లోహంలా నాకు కనిపించింది. అతని నడుము కింద చుట్టూ అగ్నిలా, ప్రకాశవంతమైన కాంతిలా కనిపించింది.