2 Chronicles 28:20
అష్షూరురాజు తిగ్లతు పిలేసెరు అతని దగ్గరికి వచ్చి అతణ్ణి బలపరచడానికి బదులు బాధపరచాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Tilgath-pilneser king of Assyria came unto him, and distressed him, but strengthened him not.
In Context
Cross References
2 Kings 15:29ఇశ్రాయేలు రాజు పెకహు రోజుల్లో అష్షూరు రాజు తిగ్లతు పిలేసెరు వచ్చి ఈయోను పట్టణాన్ని, ఆబేల్బేత్మయకా పట్టణాన్ని, యానోయహు పట్టణాన్ని, కెదెషు పట్టణాన్ని, హాసోరు పట్టణాన్ని, గిలాదు ప్రాంతాన్ని, గలిలయ ప్రాంతాన్ని, నఫ్తాలీ ప్రాంతమంతా చెరపట్టుకుని అక్కడ ఉన్నవాళ్ళను అష్షూరు దేశానికి బందీలుగా తీసుకు పోయాడు.
2 Kings 17:5అష్షూరురాజు దేశమంతటి మీదకీ, షోమ్రోను మీదకీ వచ్చి మూడు సంవత్సరాలు షోమ్రోనును ముట్టడించాడు.
Isaiah 7:20ఆ దినాన యెహోవా నది (యూప్రటీసు) అవతలి నుండి కిరాయికి వచ్చే మంగలి కత్తితో, అంటే అష్షూరు రాజు చేత నీ తల వెంట్రుకలను కాళ్ల వెంట్రుకలను గొరిగిస్తాడు. 1 అది నీ గడ్డాన్ని కూడా గొరిగిస్తుంది. 1
Isaiah 30:16“అలా కాదు. మేం గుర్రాలెక్కి పారిపోతాం” అన్నారు. కాబట్టి మీరు పారిపోతారు. ఇంకా “వేగంగా పరుగుతీసే గుర్రాలపై స్వారీ చేస్తాం” అన్నారు. కాబట్టి మిమ్మల్ని తరిమే వాళ్ళు ఇంకా వేగంగా వస్తారు. 1
Hosea 5:13తన వ్యాధిని ఎఫ్రాయిము చూశాడు. తన పుండును యూదా చూశాడు. ఎఫ్రాయిము అష్షూరీయుల దగ్గరికి వెళ్ళాడు. ఆ గొప్ప రాజు దగ్గరికి రాయబారులను పంపాడు. అయితే అతడు నిన్ను బాగు చేయలేకపోయాడు. నీ పుండు నయం చేయలేకపోయాడు.