2 సమూ 1:20
ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషించకూడదు. 1 సున్నతి లేనివారి కుమార్తెలు పండగ చేసుకోకూడదు. 1 అందుకని ఈ సంగతి గాతులో తెలియనియ్యకండి. 1 అష్కెలోను వీధుల్లో ప్రకటన చేయకండి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
19ఇశ్రాయేలూ, నీకు మహిమ అంతా 1 నీ పర్వతాలపై మృతి చెందింది. 1 బలవంతులు ఎలా పడిపోయారో గదా! 1
Cross References
Exodus 15:20అహరోను సోదరి, ప్రవక్త్రి మిర్యాము తంబుర వాయిస్తూ బయలుదేరింది. స్త్రీలంతా తంబురలు వాయిస్తూ, నాట్యం చేస్తూ ఆమెను వెంబడించారు.
Judges 11:34యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కూతురు తంబురలతో నాట్యంతో బయలుదేరి అతనికి ఎదురొచ్చింది. ఆమె తప్ప అతనికి మగ సంతానమేగాని ఆడసంతానమేగాని లేదు.
Judges 16:23ఫిలిష్తీయుల అధికారులు “మన దేవుడు మన శత్రువైన సంసోనును జయించి మన చేతికి అప్పగించాడు” అని చెప్పుకుని, వారి దేవుడైన దాగోనుకు గొప్ప బలి అర్పించడానికీ, పండగ చేసుకోడానికీ ఒక చోట చేరారు.
1 Samuel 17:26అప్పుడు దావీదు “సజీవుడైన దేవుని సైన్యాలను ఎదిరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయునికి ఎంత ధైర్యం?” వాణ్ణి చంపి ఇశ్రాయేలీయులకు వచ్చిన ఈ అపవాదును తీసివేసిన వాడికి వచ్చే బహుమతి ఏమిటి అని తన దగ్గర నిలబడినవాళ్ళని అడిగితే,
1 Samuel 18:6వారు ఫిలిష్తీయులను ఓడించి, తిరిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఊళ్ళల్లో ఉన్న స్త్రీలంతా అమిత ఆనందంగా తంబురలతో, వాయిద్యాలతో పాడుతూ నాట్యం చేస్తూ రాజైన సౌలును ఎదుర్కున్నారు.
1 Samuel 31:8తరువాతి రోజు ఫిలిష్తీయులు చనిపోయిన వారిని దోచుకోవడానికి వచ్చి గిల్బోవ కొండమీద పడి ఉన్న సౌలును, అతని ముగ్గురు కొడుకులను చూసి,