Acts 4:26
ప్రభువు మీదా ఆయన క్రీస్తు మీదా భూరాజులు లేచారు, 1 అధికారులు ఏకమయ్యారు 1 అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా, నీ సేవకుడూ, మా తండ్రీ అయిన దావీదుతో చెప్పించావు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
25యూదేతరులు ఎందుకు అల్లరి చేశారు? 1 ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు? 1
Cross References
Psalms 2:2భూరాజులు కుమ్మక్కై యెహోవాకూ ఆయన అభిషిక్తుడికీ విరోధంగా నిలబడ్డారు. పాలకులు ఏకీభవించి కుట్ర చేస్తున్నారు. 1
Daniel 9:24తిరుగుబాటును అణచి వేయడానికి, పాపాన్ని నివారణ చేయడానికి, దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి, యుగాంతం వరకు ఉండే నీతిని వెల్లడి చేయడానికి, దర్శనాన్ని ప్రవచనాన్ని ముద్రించడానికి, అతి పరిశుద్ధ స్థలాన్ని + 9:24 పరిశుద్ధ స్థలాన్ని దేవాలయం అభిషేకించడానికి, నీ ప్రజలకు, పరిశుద్ధ పట్టణానికి 70 వారాలు విధించబడ్డాయి.
Luke 4:18“ప్రభువు ఆత్మ నా మీద ఉన్నాడు. 1 పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. 1 చెరలో ఉన్న వారికి స్వేచ్ఛ, గుడ్డివారికి చూపు వస్తుందని ప్రకటించడానికీ అణగారిన వారిని విడిపించడానికీ, 1
Hebrews 1:9నువ్వు నీతిని ప్రేమించి అక్రమాన్ని అసహ్యించుకున్నావు. 1 కాబట్టి దేవా, నీ దేవుడు నీ సహచరుల కంటే 1 ఎక్కువగా ఆనంద తైలంతో నిన్ను అభిషేకించాడు. 1
Revelation 12:10అప్పుడు నేను పరలోకం నుండి బిగ్గరగా వినబడిన స్వరం విన్నాను. “మన సోదరులను నిందించే వాడూ, పగలనీ రాత్రనీ లేకుండా దేవుని ఎదుట మన సోదరులపై నేరం మోపే వాడైన అపవాదిని భూమి మీదికి తోసేశారు. కాబట్టి ఇక మన దేవుని రక్షణా శక్తీ రాజ్యమూ వచ్చేశాయి. ఆయన అభిషిక్తుడైన క్రీస్తు అధికారమూ వచ్చింది.
Revelation 17:17దేవుని మాటలు నెరవేరే వరకూ వారు తమ హృదయాల్లో ఏకీభవించి తమ రాజ్యాన్ని ఆ మృగానికి అప్పగించడం ద్వారా తన సంకల్పం కొనసాగించేలా దేవుడు వారికి ఆ మనసు పుట్టించాడు.