Amos 3:14
“ఇశ్రాయేలు పాపాలను నేను శిక్షించే రోజు, 2 బేతేలులోని బలిపీఠాలను కూడా నేను శిక్షిస్తాను. 2 బలిపీఠం కొమ్ములు విరిగిపోయి నేలరాలతాయి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
13యాకోబు ఇంటి వారికి విరోధంగా ఇది విని ప్రకటించండి. 2 యెహోవా ప్రభువు, సేనల దేవుడు చెప్పేదేమిటంటే, 2
Cross References
1 Kings 13:2ఆ దైవ సేవకుడు యెహోవా ఆజ్ఞ ప్రకారం బలిపీఠానికి వ్యతిరేకంగా ఇలా ప్రకటన చేశాడు. “బలిపీఠమా! బలిపీఠమా! యెహోవా చెప్పేదేమిటంటే, దావీదు సంతానంలో యోషీయా అనే పేరుతో ఒక మగ బిడ్డ పుడతాడు. నీ మీద ధూపం వేసిన ఉన్నత పూజా స్థలాల యాజకులను అతడు నీ మీద వధిస్తాడు. అతడు మనిషి ఎముకలను నీ మీద కాలుస్తాడు.”
2 Kings 23:15బేతేలులో ఉన్న బలిపీఠాన్ని, ఉన్నత స్థలాన్ని, అంటే, ఇశ్రాయేలువారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలం, బలిపీఠం అతడు పడగొట్టించాడు. ఆ ఉన్నత స్థలాన్ని కాల్చి పొడి అయ్యేలా తొక్కించి, అషేరాదేవి రూపాన్ని కాల్చేశాడు.
2 Chronicles 34:6అలాగే అతడు మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను వారి పట్టణాల్లో నఫ్తాలి వరకూ వాటి చుట్టు పక్కల ఉన్న శిథిలాల్లో కూడా బలిపీఠాలను పడగొట్టాడు.
Hosea 10:8ఇశ్రాయేలు వారి పాపానికి ప్రతిరూపాలైన ఆవెనులోని ఎత్తయిన పూజా స్థలాలు నాశనం అవుతాయి. వారి బలిపీఠాల మీద ముళ్ళ కంప పెరుగుతుంది. పర్వతాలతో “మమ్మల్ని కప్పండి” అనీ, కొండలను చూసి “మా మీద పడండి” అనీ వారు చెబుతారు.
Amos 5:5బేతేలును ఆశ్రయించవద్దు. 2 గిల్గాలులో అడుగు పెట్టవద్దు. 2 బెయేర్షెబాకు పోవద్దు. 2 గిల్గాలు వారు తప్పకుండా బందీలవుతారు. 2 బేతేలుకు ఇక దుఖమే.”
Amos 9:1బలిపీఠం దగ్గర ప్రభువు నిలబడి ఉండడం నేను చూశాను. ఆయన ఇలా అన్నాడు. “గడపలు కదలిపోయేలా స్తంభాల పై భాగాలను కొట్టు. 2 పై కప్పు అందరి తలల మీదా పడేలా వాటిని పగలగొట్టు. 2 తరువాత మిగిలిపోయిన వారిని నేను కత్తితో చంపుతాను. 2 ఎవడూ పారిపోలేడు. ఎవడూ తప్పించుకోలేడు. 2