Amos 6:4
వాళ్ళు దంతపు మంచాల మీద పడుకుని, 2 పరుపుల మీద ఆనుకుని కూర్చుంటారు. 2 మందలోని గొర్రె పిల్లలను, సాలలో కొవ్విన దూడలను కోసుకుని తింటారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
3విపత్తు రోజు దూరంగా ఉందనుకుని 2 దౌర్జన్య పాలన త్వరగా రప్పించిన వారవుతున్నారు. 2
5తీగ వాయిద్యాల సంగీతంతో పిచ్చిపాటలు పాడుతూ 2 దావీదులాగా వాయిద్యాలను మరింత మెరుగ్గా వాయిస్తారు. 2
Cross References
1 Samuel 25:36అబీగయీలు తిరిగి నాబాలు దగ్గరికి వచ్చినప్పుడు, రాజుల్లాగా అతడు ఇంట్లో విందు చేసి, తప్ప తాగుతూ కులుకుతూ మత్తుగా ఉన్నాడు. అందుకని తెల్లవారే వరకూ ఆమె అతనితో ఏమాటా చెప్పలేదు.
Isaiah 5:11మద్యం తాగుదామని తెల్లారే లేచి తమకు మంట పుట్టించే దాకా చాలా రాత్రి వరకూ ద్రాక్షారసం తాగే వారికి బాధ. 1
Isaiah 22:13కానీ చూడండి! దానికి బదులుగా, పశువులను చంపుదాం, గొర్రెలను వధించుదాం. 1 వాటి మాంసం తిని ద్రాక్షారసం తాగుదాం. సంతోషంతో పండగ చేసుకుందాం. ఎందుకంటే రేపు చనిపోతాం కదా” అనుకున్నారు. 1
Ezekiel 34:2“నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గురించి ఈ విషయం చెప్పు. ఆ కాపరులతో ఇలా చెప్పు, యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, తమ కడుపు నింపుకునే ఇశ్రాయేలీయుల కాపరులకు శిక్ష తప్పదు. కాపరులు గొర్రెలను మేపాలి గదా!
Luke 12:19అప్పుడు నా ప్రాణంతో ‘ప్రాణమా, ఎన్నో సంవత్సరాలకు సరిపడే తరగని ఆస్తి నీ కోసం సమకూర్చాను. సుఖపడు, తిను, తాగు, సంతోషంగా ఉండు’ అని చెబుతాను’ అనుకున్నాడు.
Romans 13:13పోకిరీ వినోదాలతో, తాగిన మత్తులో, లైంగిక దుర్నీతితో హద్దూ అదుపూ లేని కామంతో, కలహాలతో, అసూయలతో కాకుండా పగటి వెలుగులోలాగా మర్యాదగా నడుచుకుందాం.