Deuteronomy 32:4
ఆయన మనకు ఆశ్రయ దుర్గం. 1 ఆయన పని పరిపూర్ణం. 1 ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. 1 ఆయన నమ్మదగిన దేవుడు. 1 ఆయన పక్షపాతం చూపని దేవుడు. 1 ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
3నేను యెహోవా పేరును ప్రకటిస్తాను. 1 మన దేవునికి ఘనత ఆపాదించండి. 1
5వారు తమను తాము చెడగొట్టుకున్నారు. 1 వారు ఆయన సంతానం కారు. 1 వారు దోషులు, మూర్ఖులైన వక్రతరం. 1
Cross References
Genesis 18:25నీతిమంతులకూ దుర్మార్గులకూ ఒకే రకంగా తీర్పు తీర్చడం నీకు దూరమౌతుంది గాక. అలాగే దుర్మార్గులతో పాటుగా నీతిమంతులను నాశనం చేయడం నీకు దూరమౌతుంది గాక! సర్వలోకానికీ తీర్పు తీర్చేవాడు న్యాయం చెయ్యడా?”
Deuteronomy 7:9కాబట్టి మీ దేవుడు యెహోవాయే దేవుడనీ తనను ప్రేమించి, తన ఆజ్ఞలను పాటించే వారికి తన నిబంధనను స్థిరపరచేవాడనీ మీరు తెలుసుకోవాలి. ఆయన వేయి తరాల వరకూ కృప చూపేవాడనీ, నమ్మదగిన దేవుడనీ గ్రహించాలి. తనను ద్వేషించే ప్రతి ఒక్కరినీ నేరుగా నాశనం చేసి వారిని శిక్షించేవాడనీ మీరు తెలుసుకోవాలి.
Deuteronomy 32:15+ 32:15 నీతిపరుడు, అంటే ఇశ్రాయేల్యెషూరూను కొవ్వి కాలు దువ్వాడు, 1 మీరు కొవ్వుతో బలిసి మొద్దులాగా అయ్యారు. 1 యెషూరూను తనను పుట్టించిన దేవుణ్ణి వదిలేశాడు. 1 తన రక్షణ శిలను నిరాకరించాడు. 1
Deuteronomy 32:30వారి ఆశ్రయదుర్గం వారిని అమ్మి వేయకపోతే, 1 యెహోవా వారిపై మనకు విజయాన్నివ్వకపోతే, 1 ఒకడు వేయి మందిని ఎలా తరుముతాడు? 1 పదివేల మందిని ఇద్దరు ఎలా పారదోలతారు? 1
2 Samuel 22:2యెహోవా నా ఆశ్రయ శిల, నా కోట, నా రక్షకుడు. 1
2 Samuel 22:47యెహోవా సజీవుడు. నాకు అండ అయిన వాడికి స్తుతి. 1 నా విముక్తి శిల అయిన దేవుడు ఘనత నొందుగాక. 1