ప్రసంగి 8:14
సూర్యుని కింద మరొక నిష్ప్రయోజనమైంది జరుగుతూ ఉంది. అదేమంటే భక్తిహీనులకు జరిగినట్టు నీతిమంతుల్లో కొందరికీ నీతిమంతులకు జరిగినట్టు భక్తిహీనుల్లో కొందరికీ జరుగుతున్నది. ఇది కూడా నిష్ప్రయోజనమే అని నేను అనుకున్నాను.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Job 1:22జరిగిన విషయాలన్నిటిలో ఏ సందర్భంలోనూ యోబు ఎలాంటి పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని పలకలేదు.
Job 21:7భక్తిహీనులు ఇంకా ఎలా బతికి ఉన్నారు? వాళ్ళు ముసలివాళ్ళు అవుతున్నా ఇంకా బలంగా ఉంటున్నారెందుకు? 1
Job 24:21వారు గొడ్రాళ్ళను దిగమింగుతారు. వితంతువులకు మేలు చేయరు. 1
Psalms 73:3భక్తిహీనులు క్షేమంగా ఉండడం చూసి వారి గర్వాన్ని చూసి నేను అసూయపడ్డాను. 1
Ecclesiastes 2:14జ్ఞాని కళ్ళు అతని తలలో ఉన్నాయి. బుద్ధిహీనుడు చీకటిలో నడుస్తాడు. 2 అయినా అందరి గమ్యం ఒక్కటే అని నేను గ్రహించాను. 2
Ecclesiastes 4:8ఒకడు ఒంటరిగా ఉన్నాడు. 2 అతనికి జతగాడు గాని, కొడుకు గాని, సోదరుడు గాని లేడు. 2 అయినా అతడు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు. 2 ఐశ్వర్యం అతనికి తృప్తి కలిగించదు. 2 సుఖమనేది లేకుండా ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నాను అనుకుంటాడు. 2 ఇది కూడా ఆవిరిలాగా నిష్ప్రయోజనం, విచారకరం. 2