The Bible Software
bible.software › యెహెజ్కేలు › యెహెజ్కేలు 34 › యెహెజ్కేలు 34:13

యెహెజ్కేలు 34:13

ఇతర ప్రజల మధ్యనుంచి వాటిని తోడుకు వచ్చి, వాటి స్వదేశంలోకి తీసుకొస్తాను. ఇశ్రాయేలు కొండల మీద, వాగుల దగ్గర, దేశంలో నివాసాలు ఏర్పడ్డ ప్రతి స్థలంలో వాటిని మేపుతాను.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And I will bring them out from the people, and gather them from the countries, and will bring them to their own land, and feed them upon the mountains of Israel by the rivers, and in all the inhabited places of the country.

In Context

12తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకే విధంగా నేను నా గొర్రెలను వెతికి, మబ్బులు కమ్మి చీకటి అయిన రోజున అవి ఎక్కడెక్కడ చెదరిపోయాయో అక్కడ నుంచి నేను వాటిని తప్పించి,

14నేను మంచి మేత ఉన్న చోట వాటిని మేపుతాను. ఇశ్రాయేలు ఎత్తయిన కొండలు వాటికి మేత స్థలంగా ఉంటాయి. అక్కడ అవి మంచి మేత ఉన్న చోట పడుకుంటాయి. ఇశ్రాయేలు కొండల మీద మంచి పచ్చిక మైదానాల్లో అవి మేస్తాయి.

Read all of యెహెజ్కేలు 34

Cross References

Psalms 106:47యెహోవా మా దేవా, మమ్మల్ని రక్షించు. మేము నీ పరిశుద్ధనామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా, నిన్ను స్తుతిస్తూ మేము గర్వించేలా అన్యజనుల్లో నుండి మమ్మల్ని పోగుచెయ్యి. 1

Isaiah 49:9నువ్వు బందీలతో, ‘బయలుదేరండి’ అనీ చీకట్లో ఉన్నవారితో, ‘బయటికి రండి’ అనీ చెబుతావు. 1 వాళ్ళు దారిలో మేస్తారు. చెట్లు లేని కొండలమీద వారికి మేత దొరుకుతుంది. 1

Isaiah 66:19నేను వారిమధ్య ఒక గుర్తు ఉంచుతాను. వాళ్ళలో తప్పించుకున్నవాళ్ళను వేరే రాజ్యాలకు పంపిస్తాను. తర్షీషు, పూతు, లూదు అనే ప్రజల దగ్గరికీ, బాణాలు విసిరే వారి దగ్గరికీ, తుబాలు, యావాను నివాసుల దగ్గరికీ నేను పంపుతాను. నా గురించి వినకుండా నా ఘనత చూడకుండా ఉన్న దూరద్వీపవాసుల దగ్గరికీ వారిని పంపిస్తాను. వారు ప్రజల్లో నా ఘనత ప్రకటిస్తారు. 1

Jeremiah 23:8“ఉత్తర దేశంలో నుంచి, నేను వారిని చెదరగొట్టిన దేశాలన్నిటిలో నుంచి వారిని రప్పించిన యెహోవానైన నా తోడు” అని ప్రమాణం చేస్తారు. వాళ్ళు తమ దేశంలో నివసిస్తారు అని యెహోవా చెబుతున్నాడు. 1 అబద్ధ ప్రవక్తలు 1

Jeremiah 30:18యెహోవా ఇలా అంటున్నాడు “చూడు, యాకోబు నివాసస్థలాలను కరుణించి అతని గుడారాల మీద నేను కనికరం చూపిస్తాను. అప్పుడు శిథిలాల గుట్ట మీద ఒక పట్టణం నిర్మాణం అవుతుంది. ఇదివరకు ఉన్నట్టే ఒక స్థిరమైన నివాసం ఏర్పాటవుతుంది. 1

Jeremiah 32:37చూడు, నాకు కలిగిన కోపోద్రేకాలతో, మహా ఉగ్రతతో నేను వాళ్ళను వెళ్లగొట్టిన దేశాలన్నిటిలో నుంచి వాళ్ళను సమకూర్చి ఈ స్థలానికి మళ్ళీ తీసుకు రాబోతున్నాను. వాళ్ళు ఇక్కడ క్షేమంతో నివాసం ఉండేలా చేస్తాను.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study యెహెజ్కేలు 34:13

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← యెహెజ్కేలు 34:12యెహెజ్కేలు 34యెహెజ్కేలు 34:14 →