Isaiah 1:6
అరి కాలు నుంచి తల వరకు పుండు పడని భాగం లేదు. 1 ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, మానని పుళ్ళు. 1 అవి నయం కాలేదు. వాటిని ఎవరూ కడగలేదు, 1 కట్టు కట్టలేదు, నూనెతో చికిత్స చెయ్యలేదు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Job 2:7సాతాను యెహోవా సముఖం నుండి బయలుదేరి వెళ్లి, యోబు అరికాలు నుండి నడినెత్తి వరకూ బాధ కలిగించే కురుపులు పుట్టించాడు.
Psalms 38:3నీ కోపం వల్ల నా శరీరమంతా అనారోగ్యం కలిగింది. నా పాపం కారణంగా నా ఎముకల్లో ఆరోగ్యం లేకుండా పోయింది. 1
Jeremiah 6:7ఊటలో నీరు ఏవిధంగా పైకి ఉబికి వస్తుందో ఆ విధంగా దాని దుష్టత్వం పైకి ఉబుకుతూ ఉంది. 1 దానిలో బలాత్కారం, అక్రమం జరగడం వినబడుతున్నది, ఎప్పుడూ గాయాలు, దెబ్బలు నాకు కనబడుతున్నాయి. 1
Jeremiah 8:21నా జనుల వేదన చూసి నేనూ వేదన చెందుతున్నాను, వారికి జరిగిన ఘోరమైన సంగతులను బట్టి నేను రోదిస్తున్నాను. విపరీతమైన భయం నన్ను ఆవరించింది. 1
Jeremiah 30:12యెహోవా ఇలా అంటున్నాడు, ‘నీ దెబ్బ నయం కాదు. నీ గాయం మానని పుండుగా అయ్యింది. 1
Jeremiah 33:6కాని, చూడు, నేను ఆరోగ్యం, స్వస్థత తీసుకొస్తాను. నేను వాళ్ళను స్వస్థపరిచి వాళ్ళను సమృద్ధిలోకి, శాంతిలోకి, నమ్మకత్వంలోకి తీసుకొస్తాను.