Isaiah 1:5
మీకు ఇంకా దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి? 1 మీరు ఇంకా ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? 1 మీ తల అంతా గాయమే. మీ గుండె నిండా బలహీనతే. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Nehemiah 9:34మా రాజులు, ప్రధానులు, యాజకులు, మా పూర్వీకులు నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోలేదు. నువ్వు వారికి ఇచ్చిన హెచ్చరికలను, నీ ఆజ్ఞలను వారు పెడచెవిన పెట్టారు.
Isaiah 9:13అయినా ప్రజలు తమను కొట్టిన దేవుని వైపు తిరగరు. సేనల ప్రభువైన యెహోవాను వెదకరు. 1
Isaiah 31:6ఇశ్రాయేలు ప్రజలారా, ఎవరి నుండి మీరు పూర్తిగా తొలగిపోయారో ఆయన వైపుకి తిరగండి.
Jeremiah 2:30నేను మీ ప్రజలను శిక్షించడం వ్యర్థమే. ఎందుకంటే వారు శిక్షకు లోబడరు. నాశనవాంఛ గల సింహంలాగా మీ ఖడ్గం మీ ప్రవక్తలను చంపుతూ ఉంది. 1
Jeremiah 5:5కాబట్టి నేను ప్రముఖుల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడతాను. 1 వారికి యెహోవా మార్గాలు, తమ దేవుని న్యాయవిధులు తెలిసి ఉంటాయి గదా.” 1 అయితే వారందరూ కాడిని విరిచేవారే, దేవునితో అంటుకట్టిన కట్లను తెంపుకొన్న వారే. 1
Jeremiah 6:28వారంతా బహు ద్రోహులు, కొండెగాళ్ళు. వారు మట్టి లోహం వంటివారు, వారి అంతరంగం ఇత్తడి, ఇనుములాగా బహు కఠినంగా ఉంటాయి. 1