Isaiah 17:10
ఎందుకంటే నీ రక్షణకు కారకుడైన దేవుణ్ణి నువ్వు మర్చి పోయావు. నీ బలానికి ఆధారంగా ఉన్న బండను అలక్ష్యం చేశావు. 1 కాబట్టి నువ్వు అందమైన మొక్కలను నాటావు. అన్య దేశాల ద్రాక్ష చెట్లు నాటావు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Leviticus 26:16అలాగైతే నేను మీకు చేసేది ఇదే. మీమీదికి భయం రప్పిస్తాను. మీకు జ్వరం కలిగించి మీ కళ్ళు దెబ్బ తిని ప్రాణాలు నీరసించి పోయేలా చేస్తాను. మీరు చల్లిన విత్తనాలు వ్యర్థమైపోతాయి. మీ శత్రువులు వాటి పంటను తింటారు.
Deuteronomy 6:12అక్కడ మీరు తిని, తృప్తి పొందినప్పుడు, బానిసలుగా ఉన్న ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్త వహించాలి.
Deuteronomy 8:14అప్పుడు మీ మనస్సు గర్వించి, బానిసల ఇల్లైన ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు యెహోవాను మరచిపోతారేమో.
Deuteronomy 28:30ఒక కన్యను నువ్వు ప్రదానం చేసుకుంటావు కానీ వేరేవాడు ఆమెను లైంగికంగా కలుస్తాడు. మీరు ఇల్లు కడతారు కానీ దానిలో కాపురం చెయ్యరు. ద్రాక్షతోట నాటుతారు కానీ దాని పండ్లు తినరు.
Deuteronomy 32:4ఆయన మనకు ఆశ్రయ దుర్గం. 1 ఆయన పని పరిపూర్ణం. 1 ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. 1 ఆయన నమ్మదగిన దేవుడు. 1 ఆయన పక్షపాతం చూపని దేవుడు. 1 ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు. 1
Deuteronomy 32:18నీకు తండ్రి లాంటి బండను వదిలేశావు, 1 నిన్ను కన్న దేవుణ్ణి మరిచావు. 1