Isaiah 21:10
నేను నూర్చిన నా ధాన్యమా, నేను చెరిగిన వాళ్ళు, నా కళ్ళంలో నూర్చిన పిల్లలు, ఇశ్రాయేలు దేవుడు, సేనలకు అధిపతి అయిన యెహోవా దగ్గర నేను విన్నది నీకు తెలియజేశాను. 1 అరేబియాను గురించిన ప్రకటన 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
1 Kings 22:14మీకాయా “యెహోవా జీవం తోడు, యెహోవా నాకు చెప్పిందే నేను చెబుతాను” అన్నాడు.
Isaiah 28:28మనుషులు రొట్టెల కోసం గోధుమలను నూర్చి పిండి చేస్తారు. కానీ అదేపనిగా గోధుమలను పిండి చేస్తూనే ఉండరు కదా! 1 గోధుమలను దుళ్ళగొట్టడానికి గుర్రాలనూ బండి చక్రాలనూ నడిపిస్తారు గానీ దాన్ని పిండి చేయడానికి కాదు కదా! 1
Jeremiah 23:28కల కనిన ప్రవక్త ఆ కలను చెప్పవచ్చు. అయితే ఎవడికి నేను నా వాక్కు వెల్లడించానో అతడు దాన్ని నమ్మకంగా చెప్పవచ్చు. ధాన్యంతో పొట్టుకు ఏం సంబంధం? ఇదే యెహోవా వాక్కు. 1
Ezekiel 3:17“నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలకు నిన్ను కాపలా వాడిగా పెట్టాను. కాబట్టి నా నోటి మాట జాగ్రత్తగా విను. వాళ్లకి నా హెచ్చరిక తెలియచెయ్యి!
Micah 4:13యెహోవా ఇలా అంటున్నాడు, 1 “సీయోను కుమారీ, లేచి కళ్ళం తొక్కు. 1 మీకు ఇనుప కొమ్ములూ కంచు డెక్కలూ చేస్తాను. 1 నీవు అనేక ప్రజల సమూహాలను అణిచేస్తావు. 1 వారి అన్యాయ సంపదను యెహోవానైన నాకు ప్రతిష్టిస్తాను. 1 వారి ఆస్తిపాస్తులను సర్వలోక ప్రభువునైన నాకు ప్రతిష్టిస్తాను.”
Matthew 3:12తూర్పారబట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళం బాగా శుభ్రం చేసి తన గోదుమలు గిడ్డంగిలో పోస్తాడు. పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు” అని చెప్పాడు. 1 యేసు బాప్తిసం మార్కు 1:9-11; లూకా 3:21-22; యోహా 1:31-34