Isaiah 23:12
ఆయన ఇలా అన్నాడు “పీడన కింద ఉన్న సీదోను కన్యా, నీకిక సంతోషం ఉండదు. 1 నువ్వు కిత్తీముకి తరలి వెళ్ళు. కానీ అక్కడ కూడా నీకు విశ్రాంతి కలగదు.” 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 10:4యావాను సంతానం ఏలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము.
Genesis 49:13జెబూలూను సముద్రపు ఒడ్డున నివసిస్తాడు. అతడు ఓడలకు రేవుగా ఉంటాడు. అతని పొలిమేర సీదోను వరకూ ఉంటుంది. 1
Deuteronomy 28:64యెహోవా భూమి ఈ చివర నుంచి ఆ చివరి వరకూ అన్య దేశాల్లో మీరు చెదిరిపోయేలా చేస్తాడు. అక్కడ మీ పితరులు సేవించని చెక్కతో, రాయితో చేసిన అన్య దేవుళ్ళను కొలుస్తారు.
Isaiah 23:1ఇది తూరును గూర్చిన దైవ ప్రకటన. 1 తర్షీషు ఓడలారా, పెడ బొబ్బలు పెట్టండి. ఎందుకంటే ఓడరేవు గానీ ఆశ్రయం గానీ లేవు. 1 కిత్తీము దేశం నుండి వాళ్లకి ఈ విషయం వెల్లడి అయింది. 1
Isaiah 37:22అతని గూర్చి యెహోవా సెలవిచ్చే మాట ఇదే, “కన్య అయిన సీయోను ఆడపడుచు నిన్ను తిరస్కరించి, అపహసిస్తున్నది, యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊపుతూ ఉంది.
Isaiah 47:5కల్దీయుల కుమారీ, మౌనంగా చీకటిలోకి వెళ్ళిపో. 1 రాజ్యాలన్నిటికీ రాణి అని ప్రజలు ఇంక నిన్ను పిలవరు. 1