Isaiah 30:28
ఆయన శ్వాస గొంతు వరకూ వచ్చిన బలమైన నదీ ప్రవాహంలా ఉంది. అది నాశనం చేసే జల్లెడలా జాతులను జల్లెడ పడుతుంది. ఆయన శ్వాస జాతుల దవడల్లో కళ్ళెంలా ఉండి వాళ్ళని దారి తప్పిస్తుంది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
2 Samuel 17:14అబ్షాలోము, ఇశ్రాయేలువారు ఈ మాట విని అర్కీయుడైన హూషై చెప్పిన మాట అహీతోపెలు చెప్పినదానికంటే యోగ్యమైనదని ఒప్పుకున్నారు. ఎందుకంటే యెహోవా అబ్షాలోము మీదికి విపత్తు రప్పించాలని అహీతోపెలు చెప్పిన తెలివైన ప్రణాళిక నిరర్ధకమయ్యేలా చేయాలని నిశ్చయించుకున్నాడు.
2 Kings 19:28నా మీద నీవు వేసే రంకెలూ, నీవు చేసిన గొడవ నా చెవుల్లో పడింది గనుక నా గాలాన్ని నీ ముక్కుకు తగిలిస్తాను. నా కళ్ళెం నీ నోట్లో పెట్టి నిన్ను మళ్ళిస్తాను. నీవు వచ్చిన దారిలోనే నిన్ను మళ్ళిస్తాను.
Psalms 18:15యెహోవా, నీ నాసికారంధ్రాల ఊపిరికి నీ సింహనాదానికి ప్రవాహాలు బయలు దేరాయి. భూమి పునాదులు బయటపడ్డాయి. 1
Proverbs 26:3గుర్రానికి చెర్నాకోల. గాడిదకు కళ్ళెం. మూర్ఖుల వీపుకు బెత్తం.
Isaiah 11:4కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చడు. తాను విన్న దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీరుస్తాడు. భూనివాసుల్లో దీనులైన వాళ్లకు నిజాయితీగా విమర్శ చేస్తాడు. తన నోటి దండంతో లోకాన్ని కొడతాడు. తన పెదవుల ఊపిరితో దుర్మార్గులను హతం చేస్తాడు. 1
Isaiah 17:14సాయంత్రం, చూడండి, భయోత్పాతం! ఉదయం కాకుండానే వాళ్ళు కనిపించకుండా పోతారు. 1 మమ్మల్ని దోచుకునే వాళ్లకి పట్టే గతి ఇదే. మా సంపదను దొంగతనం చేసేవాళ్ళకి దక్కేది ఇదే.