Isaiah 51:5
నా నీతి దగ్గరగా ఉంది. నా విడుదల బయలుదేరుతుంది. నా చెయ్యి రాజ్యాలను శిక్షిస్తుంది. 1 ద్వీపాల్లో ఉండేవాళ్ళు నా కోసం ఎదురు చూస్తారు. వాళ్ళు నా చేతి వైపు ఆశతో చూస్తారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
1 Samuel 2:10యెహోవాతో వాదులాడేవారు నాశనమైపోతారు. 1 పరలోకం నుండి ఆయన వారి మీద ఉరుములాగా గర్జిస్తాడు. 1 భూదిగంతాల ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తాడు. 1 తాను నిలబెట్టిన రాజుకు ఆయన బలమిస్తాడు. 1 తాను అభిషేకించిన రాజుకు అధికమైన బలం కలిగిస్తాడు.”
Psalms 67:4ప్రజలు సంతోషంతో ఆనందగానాలు చేస్తారు. ఎందుకంటే నువ్వు జాతులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు. భూరాజ్యాలను ఏలుతావు. 1
Psalms 96:13లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. నీతితో ఆయన లోకానికి తన విశ్వసనీయతతో ప్రజా సమూహాలకు ఆయన తీర్పు తీరుస్తాడు.
Psalms 110:6అన్యజాతులకు ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన లోయలను శవాలతో నింపుతాడు. అనేక దేశాల నేతలను ఆయన హతమారుస్తాడు. 1
Isaiah 40:10ఇదిగో, ప్రభువైన యెహోవా జయశాలి అయిన యోధునిగా వస్తున్నాడు. తన బలమైన చేతితో ఆయన పాలిస్తాడు. 1 ఆయన ఇవ్వదలచిన బహుమానం ఆయనతో ఉంది. ఆయన ఇచ్చే ప్రతిఫలం ఆయనకు ముందుగా నడుస్తున్నది. 1
Isaiah 46:13నా నీతిని మీకు దగ్గరగా తెచ్చాను. అది దూరంగా లేదు. నా రక్షణ ఆలస్యం కాదు. 1 సీయోనుకు నా రక్షణ అందిస్తాను. ఇశ్రాయేలుకు నా మహిమను అనుగ్రహిస్తాను.