Isaiah 56:7
నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేస్తాను. 1 నా బలిపీఠం మీద వారు అర్పించే దహనబలులూ బలులూ నాకు అంగీకారమవుతాయి. 1 నా మందిరం అన్ని రాజ్యాలకూ ప్రార్థన మందిరం అవుతుంది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Psalms 2:6నా పవిత్ర పర్వతం సీయోను మీద నేనే నా రాజును అభిషేకించాను. 1
Isaiah 57:13నువ్వు కేకలు పెట్టేటప్పుడు నీ విగ్రహాల గుంపు నిన్ను తప్పించాలి! 1 వాటన్నిటినీ గాలి ఎగరగొట్టేస్తుంది. ఊపిరితో అవన్నీ కొట్టుకుపోతాయి. 1 అయితే నన్ను నమ్ముకునేవారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. నా పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనం చేసుకుంటారు. 1 సాత్వికులకు ఆదరణ 1
Isaiah 66:19నేను వారిమధ్య ఒక గుర్తు ఉంచుతాను. వాళ్ళలో తప్పించుకున్నవాళ్ళను వేరే రాజ్యాలకు పంపిస్తాను. తర్షీషు, పూతు, లూదు అనే ప్రజల దగ్గరికీ, బాణాలు విసిరే వారి దగ్గరికీ, తుబాలు, యావాను నివాసుల దగ్గరికీ నేను పంపుతాను. నా గురించి వినకుండా నా ఘనత చూడకుండా ఉన్న దూరద్వీపవాసుల దగ్గరికీ వారిని పంపిస్తాను. వారు ప్రజల్లో నా ఘనత ప్రకటిస్తారు. 1
Ezekiel 47:22మీరు చీట్లువేసి మీకూ మీలో నివసించి పిల్లలు కన్న పరదేశులకూ ఆస్తులను విభజించేటప్పుడు ఇశ్రాయేలీయుల దేశంలో పుట్టిన వారిగానే ఆ పరదేశులను మీరు ఎంచాలి. ఇశ్రాయేలు గోత్రికులతో పాటు తాము కూడా స్వాస్థ్యం పొందేలా మీలాగా వారు కూడా చీట్లు వేయాలి.
Zechariah 8:3యెహోవా చెప్పేదేమిటంటే “నేను సీయోను దగ్గరికి మళ్ళీ వచ్చి, యెరూషలేములో నివాసం చేస్తాను. సత్య పురమనీ, సేనల ప్రభువు యెహోవా కొండ అనీ, పరిశుద్ధ పర్వతమనీ దానికి పేర్లు పెడతారు.
Matthew 21:13వారితో ఇలా అన్నాడు, “‘నా ఆలయం ప్రార్థనకు నిలయం’ అని రాసి ఉంది. కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేసేశారు.”