Isaiah 60:18
ఇకనుంచి నీ దేశంలో దుర్మార్గం అనే మాట వినబడదు. నీ సరిహద్దుల్లో నాశనం, ధ్వంసం అనే మాటలు వినబడవు. 1 నీ గోడలను విడుదల అనీ నీ ద్వారాలను స్తుతి అనీ అంటావు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Psalms 72:3నీతిని బట్టి పర్వతాలు, కొండలు ప్రజలకు క్షేమం కలిగిస్తాయి గాక. 1
Isaiah 11:9నా పరిశుద్ధ పర్వతమంతటి మీద, ఏ మృగమూ హాని చెయ్యదు, నాశనం చెయ్యదు. ఎందుకంటే సముద్రం నీటితో నిండి ఉన్నట్టు లోకం యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది. 1
Micah 4:3ఆయన మధ్యవర్తిగా అనేక ప్రజలకు న్యాయం తీరుస్తాడు. 1 దూరంగా ఉండే విస్తారమైన రాజ్యాల వివాదాలను పరిష్కరిస్తాడు. 1 వారు తమ కత్తులను నాగటి నక్కులుగా 1 తమ ఈటెలను మచ్చు కత్తులుగా సాగగొడతారు. 1 రాజ్యం మీదికి రాజ్యం కత్తి ఎత్తకుండా ఉంటారు. 1 యుద్ధ విద్య నేర్చుకోవడం మానివేస్తారు.
Zechariah 9:8నేను కన్నులారా చూశాను గనక బాధించేవారు ఇకపై సంచరించకుండా, తిరుగులాడే సైన్యాలు నా మందిరం మీదికి రాకుండా దాన్ని కాపాడుకోడానికి నేనొక సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేస్తాను.