Isaiah 61:6
మిమ్మల్ని యెహోవా యాజకులని పిలుస్తారు. మా దేవుని సేవకులని మిమ్మల్ని పిలుస్తారు. 1 రాజ్యాల ఐశ్వర్యాన్ని మీరు అనుభవిస్తారు. వాటి సమృద్ధిలో మీరు అతిశయిస్తారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
5విదేశీయులు నిలబడి మీ మందలను మేపుతారు. విదేశీయుల పిల్లలు మీ పొలాల్లో ద్రాక్షతోటల్లో పనిచేస్తారు. 1
Cross References
Exodus 19:6మీరు యాజక రాజ్యంగా పవిత్రప్రజగా ఉంటారు.’ నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాల్సిన మాటలు ఇవే” అన్నాడు.
Isaiah 23:18ఆమె పొందిన లాభం, సంపాదన యెహోవాకు చెందుతుంది. దాన్ని సేకరించడం, జమ చేయడం జరగదు. 1 యెహోవా సన్నిధిలో నివసించే వారి భోజనానికీ, మంచి బట్టలకీ ఆమె వర్తక లాభం వినియోగిస్తారు.
Isaiah 60:5నువ్వు చూసి ప్రకాశిస్తావు. నీ హృదయం ఆనందిస్తూ ఉప్పొంగుతుంది. సముద్ర సమృద్ధి నీ మీద కుమ్మరించడం జరుగుతుంది. రాజ్యాల ఐశ్వర్యం నీ దగ్గరికి వస్తుంది. 1
Isaiah 60:16రాజ్యాల పాలుకూడా నువ్వు తాగుతావు. రాజుల చనుపాలు తాగుతావు. 1 యెహోవానైన నేను నీ రక్షకుడిననీ యాకోబు బలవంతుడైన దేవుడిననీ నీ విమోచకుడిననీ నువ్వు తెలుసుకుంటావు. 1
Isaiah 66:21“యాజకులుగా లేవీయులుగా ఉండడానికి నేను వారిలో కొందరిని ఏర్పరచుకుంటాను” అని యెహోవా చెబుతున్నాడు. 1
Ezekiel 14:11దీని కారణంగా ఇశ్రాయేలు ప్రజలు ఇక మీదట నాకు దూరంగా వెళ్ళరు. తమ అతిక్రమాలన్నిటితో తమను తాము అపవిత్రం చేసుకోరు. వాళ్ళు నా ప్రజలై ఉంటారు. నేను వాళ్ళ దేవుడినై ఉంటాను.” ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.