Jeremiah 13:10
ఈ ప్రజలు అన్య దేవుళ్ళను పూజిస్తూ, వాటికే నమస్కారం చేస్తున్నారు. వాటినే అనుసరిస్తూ, నా మాటలు వినకుండా తమ హృదయ కాఠిన్యం చొప్పున నడుస్తున్నారు. వారు ఎందుకూ పనికిరాని ఈ నడికట్టులాగా అవుతారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Numbers 14:11యెహోవా మోషేతో “ఎంతకాలం ఈ ప్రజలు నన్ను కించపరుస్తారు? నా శక్తిని చూపించే సూచనలన్నీ నేను వారి మధ్య జరిగించినా, నన్ను ఇంకెంతకాలం నమ్మకుండా ఉంటారు?
Psalms 78:8ఆయన యాకోబు సంతానానికి శాసనాలు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు సంతానానికి ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. తమ సంతానానికి దాన్ని నేర్పించాలని మన పూర్వీకులకు ఆజ్ఞాపించాడు. 1
Isaiah 3:24అప్పుడు పరిమళ ద్రవ్యానికి బదులుగా దుర్గంధం, 1 నడికట్టుకు బదులుగా తాడూ, 1 అల్లిన జడకు బదులుగా బోడి తల, 1 ప్రశస్థమైన పైటకు బదులు గోనెపట్టా, 1 అందానికి బదులు వాత ఉంటాయి. 1
Jeremiah 5:23ఈ ప్రజలు తిరుగుబాటు, ద్రోహం చేసే మనస్సు గలవారు, వారు పక్కకు తొలగిపోతున్నారు. 1
Jeremiah 7:24అయితే వారు వినలేదు, అస్సలు వినలేదు. తమ దుష్టహృదయంలో నుండి వచ్చిన ఆలోచనల ప్రకారం జీవించారు. కాబట్టి వారు ముందుకు సాగలేక వెనకబడిపోయారు.
Jeremiah 9:13యెహోవా చెప్పేదేమంటే, “దానికి కారణం, వారు నా మాట వినలేదు, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా తోసిపుచ్చారు.