Jeremiah 39:4
యూదుల రాజైన సిద్కియా, అతని యోధులందరూ వాళ్ళను చూసి పారిపోయారు. వాళ్ళు రాత్రిపూట రాజు తోట మార్గంలో రెండు గోడల మధ్య ఉన్న గుమ్మపు దారిలో నుంచి పట్టణం బయటకు వెళ్ళిపోయారు. రాజు అరాబా మైదానం వైపుగా వెళ్ళాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Leviticus 26:17మీ నుండి ముఖం తిప్పేసుకుంటాను. మీ శత్రువులు మిమ్మల్ని లోబరచుకుంటారు. మిమ్మల్ని ద్వేషించేవారు మిమ్మల్ని పరిపాలిస్తారు. ఎవరూ తరమకపోయినా మీరు పారిపోతారు.
Deuteronomy 28:25యెహోవా మీ శత్రువుల ఎదుట మిమ్మల్ని ఓడిస్తాడు. ఒక దారిలో మీరు వారికెదురుగా వెళ్ళి ఏడు దారుల్లో పారిపోతారు. ప్రపంచ దేశాలన్నిటిలో అటూ ఇటూ చెదరిపోతారు.
2 Kings 25:4కల్దీయులు పట్టణ ప్రాకారాన్ని పడగొట్టినప్పుడు, సైనికులు రాత్రిపూట రాజు తోట దగ్గర రెండు గోడల మధ్యలో ఉన్న ద్వారం మార్గంలో పారిపోయారు.
Isaiah 22:3నీ అధిపతులంతా కలసి పారిపోయారు. కానీ విలుకాళ్ళు బాణాలు వేసి కొట్టకుండానే వాళ్ళు దొరికి పోయారు. 1 దూరంగా పారిపోయినా శత్రువు వాళ్ళందర్నీ కలిపి పట్టుకున్నాడు. 1
Isaiah 30:15ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడూ ప్రభువూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “మీరు తిరిగి వచ్చి విశ్రాంతిగా నాలో ఉంటేనే రక్షణ పొందుతారు. మౌనంలోనూ, విశ్వాసంలోనూ మాత్రమే మీకు బలం కలుగుతుంది.” కానీ దానికి మీరు ఒప్పుకోలేదు. 1
Jeremiah 38:18కాని నువ్వు బబులోను అధిపతుల దగ్గరికి వెళ్లకపోతే, ఈ నగరాన్ని కల్దీయుల చేతికి అప్పగించడం జరుగుతుంది. వాళ్ళు అగ్నితో దాన్ని కాల్చేస్తారు. నువ్వు వాళ్ళ చేతిలోనుంచి తప్పించుకోలేవు.”