Jeremiah 4:5
యెరూషలేములో వినబడేలా యూదాలో ఇలా ప్రకటించండి. “దేశంలో బూర ఊదండి.” గట్టిగా ఇలా హెచ్చరిక చేయండి. “ప్రాకారాలతో ఉన్న పట్టణాల్లోకి వెళ్దాం రండి.”
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Numbers 10:3సన్నిధి గుడారం ఎదుట నీ దగ్గరికి సమాజమంతా సమావేశం కావడానికి యాజకులు ఆ బాకాలు ఊదాలి.
Isaiah 28:19అవి వచ్చినప్పుడల్లా మిమ్మల్ని ముంచెత్తి వేస్తాయి. 1 ప్రతి ఉదయమూ, ప్రతి పగలూ, ప్రతి రాత్రీ అది వస్తుంది. 1 ఈ వార్త అర్థం అయినప్పుడు అది మహాభయాన్ని కలిగిస్తుంది. 1
Jeremiah 6:1“బెన్యామీను ప్రజలారా, యెరూషలేము నుండి పారిపొండి, తెకోవలో బాకానాదం ఊదండి. బేత్‌హక్కెరెంలో ఒక సూచన నిలబెట్టండి. 1 ఎందుకంటే ఉత్తర దిక్కునుండి గొప్ప ప్రమాదం ముంచుకొస్తున్నది. గొప్ప దండు వస్తున్నది. 1
Jeremiah 9:12ఈ సంగతిని అర్థం చేసుకోగల జ్ఞానం ఎవరికుంది? దాన్ని వివరించడానికి యెహోవా ఎవరికి తన నోటి మాట ఇచ్చాడు? 1 ఎవరూ ప్రయాణం చేయలేకుండా ఆ దేశం ఎందుకు ఎడారిలా మారిపోయింది?
Jeremiah 35:11కాని, బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశం మీద దాడి చేసినప్పుడు, ‘కల్దీయుల సైన్యం, సిరియనుల సైన్యం నుంచి మనం తప్పించుకుని యెరూషలేముకు వెళ్దాం రండి’ అని మేము చెప్పుకున్నాం కాబట్టి మేము యెరూషలేములో నివాసం ఉంటున్నాం” అని చెప్పారు.
Hosea 8:1“బాకా నీ నోట ఉంచుకో. ప్రజలు నా నిబంధన అతిక్రమించారు. నా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు. కాబట్టి యెహోవానైన నా ఇంటి మీద వాలడానికి గద్ద వస్తూ ఉంది అని ప్రకటించు.”