Jeremiah 49:31
మీరు లేవండి! నిశ్చింతగానూ క్షేమంగానూ నివసిస్తున్న రాజ్యంపై దాడి చేయండి.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. 1 “వాళ్లకు ద్వారాలు లేవు. ఉన్నా వాటికి అడ్డు గడియలు లేవు. ప్రజలు హాయిగా నివసిస్తున్నారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Numbers 23:9రాతిబండల మీద నుంచి ఆయన్ని చూస్తున్నాను. 1 కొండలపై నుండి ఆయన్ని కనుగొన్నాను. 1 చూడు, ఒంటిగా నివసించే జనం ఒకటి ఉంది. 1 వారు ఒక సాధారణ జనంగా తమను తాము ఎంచుకోరు. 1
Judges 18:7అప్పుడు ఆ ఐదుగురు మనుష్యులు వెళ్లి లాయిషుకు వచ్చారు. అక్కడ జనం, సీదోనీయుల్లా భద్రంగా, నిర్భయంగా నివసించడం చూశారు. ఆ దేశాన్ని ఆక్రమించుకుని అధికారం చెలాయించేవాళ్ళు గానీ, బాధలు పెట్టేవాళ్ళు గానీ లేకపోవడం చూసారు. వాళ్ళు సీదోనీయులకు దూరంగా నివసించడమూ, వాళ్ళకు ఎవరితోనూ + 18:7 ఎవరితోనూ అరామియులు ఎలాంటి సంబంధాలు లేకపోవడమూ చూశారు.
Psalms 123:4అలగాజనం వేసే నిందలతో, గర్విష్ఠుల తిరస్కారాలతో మేము నిండిపోయాము.
Isaiah 32:11సుఖమైన, తేలికైన జీవితాన్ని జీవించే పడతులారా, వణకండి. తమపై నమ్మకం కలిగిన స్త్రీలూ, కలవరపడండి. 1 చక్కని మీ బట్టలు తీసివేసి నగ్నంగా తయారవ్వండి. మీ నడుముకి గోనెగుడ్డ కట్టుకోండి. 1
Jeremiah 48:11మోయాబు తన బాల్యం నుండీ సురక్షితంగానే ఉన్నట్టు భావించాడు. 1 అతడు ఒక పాత్రనుండి మరో పాత్రకు పోయని ద్రాక్షరసంలా ఉన్నాడు. అలాగే అతడు ఎప్పుడూ చెరలోకి వెళ్ళలేదు. 1 కాబట్టి అతని రుచి ఎప్పటిలా బాగానే ఉంది. సువాసన కూడా మారకుండా ఉంది.
Ezekiel 38:11నువ్వు దురాలోచనతో ఇలా అనుకుంటావు, నేను ప్రాకారాలు, అడ్డగడియలు, ద్వారాలు లేని దేశం పైకి వెళ్తాను. విశ్రాంతిగా, నిర్భయంగా నివసించే వారి మీదికి వెళ్తాను.