Numbers 23:9
రాతిబండల మీద నుంచి ఆయన్ని చూస్తున్నాను. 1 కొండలపై నుండి ఆయన్ని కనుగొన్నాను. 1 చూడు, ఒంటిగా నివసించే జనం ఒకటి ఉంది. 1 వారు ఒక సాధారణ జనంగా తమను తాము ఎంచుకోరు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
8దేవుడు శపించనివారిని నేనెలా శపించను? 1 దేవుడు వ్యతిరేకించని వారిని నేనెలా వ్యతిరేకించను? 1
Cross References
Exodus 19:5ఇప్పుడు మీరు నా మాట శ్రద్ధగా విని, నా ఒడంబడిక ప్రకారం నడుచుకుంటే అన్ని దేశ ప్రజల్లో నాకు విశేషమైన ఆస్తిగా ఉంటారు. భూమి అంతా నాదే గదా.
Deuteronomy 32:8మహోన్నతుడు ప్రజలకు వారి వారి వారసత్వాలను పంచి ఇచ్చినప్పుడు, 1 మానవ జాతులను వేరు పరచినపుడు, 1 ఇశ్రాయేలు ప్రజల లెక్క ప్రకారం ప్రజలకు హద్దులు నియమించాడు. 1
Ezra 9:2వారి ఆడపిల్లలను పెళ్లి చేసుకొంటున్నారు, తమ కూతుళ్ళని వారి కొడుకులకు ఇస్తున్నారు. ప్రత్యేక జనంగా ఉండాల్సిన వీరు ఆ జాతుల పవిత్రమైన ప్రజలతో కలిసిపోయారు. పైగా ఈ తప్పులు చేస్తున్న వారిలో మన పెద్దలు, అధికారులు కూడా ప్రముఖంగా ఉన్నారు.”
Jeremiah 46:28నా సేవకుడైన యాకోబూ, నువ్వు భయపడకు.” ఇదే యెహోవా చేస్తున్న ప్రకటన. “ఎందుకంటే నేను నీతో ఉన్నాను. నేను మిమ్మల్ని ఏ ఏ దేశాల్లోకి చెదరగొట్టానో ఆ దేశాలను సమూలంగా నాశనం చేస్తాను. కానీ నిన్ను పూర్తిగా నాశనం చేయను. అయితే నా సేవకుడవైన యాకోబూ, నేను నీకు తోడుగా ఉన్నాను. భయపడకు. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టానో ఆ దేశప్రజలందరినీ సమూల నాశనం చేస్తాను. అయితే నిన్ను సమూలంగా నాశనం చేయను. న్యాయమైన విధంగా నిన్ను శిక్షిస్తాను. శిక్షించకుండా నిన్ను వదిలిపెట్టను.”
Micah 7:14నీ చేతికర్రతో నీ ప్రజలకు కాపరిగా ఉండు. వారు నీ సొత్తు. 1 కర్మెలుకు చెందిన అడవిలో వాళ్ళు ఒంటరిగా నివసిస్తున్నా 1 పూర్వ కాలంలో బాషాను, గిలాదుల్లో మేసినట్టు మేస్తారు. 1
2 Corinthians 6:17కాబట్టి, “మీరు వారిలో నుండి బయటికి వచ్చి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టవద్దు” అని ప్రభువు చెబుతున్నాడు. 1