Joel 2:20
ఉత్తర దిక్కు నుంచి వచ్చే సేనను మీకు దూరంగా పారదోలతాను. 1 వారిని ఎండిపోయి, పాడైపోయిన ప్రాంతానికి తోలివేస్తాను. 1 దాని ముందు భాగాన్ని తూర్పు సముద్రంలో, దాని వెనుక భాగాన్ని పడమటి సముద్రంలో పడేస్తాను. 1 అది కంపు కొడుతుంది, చెడ్డవాసన వస్తుంది. 1 నేను గొప్ప పనులు చేస్తాను.” 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
21దేశమా, భయపడక సంతోషించి గంతులు వెయ్యి. 1 యెహోవా గొప్ప పనులు చేశాడు. 1
Cross References
Exodus 10:19అప్పుడు యెహోవా, గాలిని తిప్పి శక్తివంతమైన పడమటి గాలి విసిరేలా చేశాడు. ఆ గాలి తీవ్రతకు మిడతలు కొట్టుకుపోయి ఎర్ర సముద్రంలో పడిపోయాయి. ఐగుప్తు దేశమంతటిలో ఒక్క మిడత కూడా మిగలలేదు.
2 Kings 8:13అందుకు హజాయేలు “నేను కుక్కలాంటి వాణ్ణి. ఇంత పెద్ద పని నేనెలా చేస్తాను?” అన్నాడు. దానికి ఎలీషా “నీవు సిరియాకు రాజు అవుతావు. నాకు యెహోవా చూపించాడు” అన్నాడు.
Isaiah 34:3వారిలో చనిపోయిన వారిని ఎవరూ సమాధి చేయరు. 1 వారి శవాలు కంపుకొడతాయి. వారి రక్తం కొండలను నింపేస్తుంది. 1
Ezekiel 39:12దేశాన్ని శుద్ధీకరిస్తూ వారిని పాతిపెట్టడానికి ఇశ్రాయేలీయులకు ఏడు నెలలు పడుతుంది.
Ezekiel 47:18తూర్పుదిక్కున హవ్రాను, దమస్కు, గిలాదులకు ఇశ్రాయేలీయుల దేశానికి మధ్య యొర్దానునది సరిహద్దుగా ఉంటుంది. సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రం వరకూ దాన్ని కొలవాలి. ఇది మీకు తూర్పు సరిహద్దు.
Joel 2:2అది చీకటి రోజు, గాఢాంధకారమయమైన రోజు. 1 కారు మబ్బులు కమ్మే కటిక చీకటి రోజు. 1 పర్వతాల మీద ఉదయకాంతి ప్రసరించినట్టు 1 బలమైన గొప్ప సేన వస్తూ ఉంది. 1 అలాంటి సేన ఎన్నడూ లేదు, ఇక ఎన్నడూ మళ్ళీ రాదు. 1 తరతరాల తరువాత కూడా అది ఉండదు.