Lamentations 4:11
యెహోవా తన కోపం తీర్చుకున్నాడు. తన కోపాగ్ని కుమ్మరించాడు. ఆయన సీయోనులో అగ్ని రాజేశాడు. అది దాని పునాదులను కాల్చేసింది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Leviticus 26:28నేను కోపపడి మీకు విరోధంగా నడుస్తాను. నేనే మీ పాపాలను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండిస్తాను.
Isaiah 51:20నీ కొడుకులు మూర్ఛపోయారు. దుప్పి వలలో చిక్కుపడినట్టు, ప్రతి వీధిలో పడియున్నారు. 1 యెహోవా కోపంతో నీ దేవుని గద్దింపుతో వారు నిండిపోయారు. 1
Jeremiah 7:20కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఈ స్థలం మీదా, ఈ మనుషుల మీదా, జంతువుల మీదా, పొలాలమీదా, చెట్ల మీదా, పంటల మీదా నా కోపాన్ని, నా ఉగ్రతను కుమ్మరిస్తాను. అది ఎన్నటికీ ఆరదు, మండుతూనే ఉంటుంది.
Jeremiah 13:14అప్పుడు నేను తండ్రులూ కొడుకులూ అందరూ కూలిపోయి ఒకడి మీద ఒకడు పడేలా చేస్తాను. వారి మీద జాలీ, కనికరమూ చూపకుండా వారిని నాశనం చేస్తాను.” 1 చెరను గురించి హెచ్చరిక 1
Jeremiah 15:1అప్పుడు యెహోవా నాకిలా చెప్పాడు. “మోషే అయినా సమూయేలైనా నా ఎదుట నిలబడినప్పటికీ ఈ ప్రజలను అంగీకరించడానికి నాకు మనస్సు ఒప్పుకోదు. నా దగ్గర నుంచి వాళ్ళను వెళ్లగొట్టు. వాళ్ళను వెళ్లనియ్యి.” 1
Jeremiah 19:3“యూదా రాజులారా! యెరూషలేము నివాసులారా! యెహోవా మాట వినండి. సేనల అధిపతి యెహోవా, ఇశ్రాయేలు దేవుడు చెప్పేది వినండి. నేను ఈ స్థలం మీదికి విపత్తు రప్పిస్తున్నాను. దాని గురించి వినేవారందరి చెవులు గింగురుమనేటంత భయంకరంగా ఉంటుంది. 1