Philippians 3:19
నాశనమే వారి అంతం. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన వాటినే గొప్పగా చెప్పుకుంటున్నారు. లౌకిక విషయాల మీదే వారు మనసు ఉంచుతారు. 1 (7) విశ్వాసి నిరీక్షణకు ఆధారం క్రీస్తు
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
1 Samuel 2:29నా సన్నిధి ఉండే స్థలానికి నేను నిర్ణయించిన బలి నైవేద్యాలను మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు? మిమ్మల్ని మీరు కొవ్వబెట్టుకోడానికి నా ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసే నైవేద్యాల్లో శ్రేష్ఠమైన భాగాలను మీరే ఉంచుకొంటూ నాకంటే నీ కొడుకులను నీవు గొప్ప చేస్తున్నావు.
Psalms 17:14నీ చేతితో మనుషుల బారినుండి, యెహోవా, ఈ జీవితకాలంలో మాత్రమే సంపదలు ఉన్న ఈ లోకసంబంధుల నుంచి నన్ను రక్షించు. నువ్వు అపురూపంగా ఎంచిన నీ వాళ్ళ కడుపులు నిధులతో నింపుతావు. వాళ్ళు బహుసంతానం కలిగి తమ ఆస్తిని తమ పిల్లలకు సంక్రమింపజేస్తారు. 1
Isaiah 56:10వారి కాపలాదారులంతా గుడ్డివాళ్ళు. వాళ్ళంతా తెలివితక్కువ వాళ్ళు. వాళ్ళంతా మొరగలేని మూగకుక్కలు. 1 పడుకుని కలలు కంటారు. నిద్ర అంటే వారికి చాలా ఇష్టం. 1
Ezekiel 34:3మీరు కొవ్విన గొర్రెలను వధించి, కొవ్వు తిని, బొచ్చును కప్పుకుంటారు. కానీ గొర్రెలను మేపరు.
Micah 3:5నా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రవక్తలను గురించి యెహోవా చెప్పేదేమిటంటే, 1 తమకు భోజనం పెట్టేవారికి “సంపద వస్తుంది” అని చెబుతారు. 1 భోజనం పెట్టకపోతే, వారి మీద యుద్ధం ప్రకటిస్తారు. 1
Habakkuk 2:15తమ పొరుగు వాణ్ణి నగ్నంగా చూడాలని విషం కలిపి వారికి తాగించి వారిని మత్తులుగా చేసేవారికి బాధ.