1 సమూ 2:5
తృప్తిగా భోజనం చేసినవారు అన్నం కోసం కూలి పనికి వెళ్తారు. 1 ఆకలి వేసినవారు కడుపునిండా తింటారు. 1 గొడ్రాలు ఏడుగురు పిల్లలను కంటుంది. 1 ఎక్కువమంది పిల్లలను కనిన స్త్రీ కృశించిపోతుంది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
4పేరుగాంచిన విలుకాళ్ళు ఓడిపోతారు. 1 తొట్రిల్లి పడిపోయినవారు బలం పొందుతారు. 1
Cross References
1 Samuel 1:20హన్నా గర్భం ధరించి, రోజులు గడిచిన తరువాత ఒక కొడుకుని కని “నేను మహోన్నతమైన యెహోవాకు మొక్కుకుని వీణ్ణి అడిగాను” అని చెప్పి ఆ పసికందుకు సమూయేలు అని పేరు పెట్టింది. 1 సమూయేలును హన్నా ప్రతిష్టించడం
Psalms 113:9ఆయన పిల్లలు లేని దాన్ని ఇల్లాలుగా చేస్తాడు. ఆమెకు పిల్లల తల్లిగా సంతోషం కలగజేస్తాడు. యెహోవాను స్తుతించండి.
Jeremiah 15:9ఏడుగురిని కనిన స్త్రీ నీరసించి ప్రాణం విడుస్తుంది. పగటి సమయం ఇంకా ఉండగానే ఆమె పొద్దు ముగుస్తుంది. ఆమె సిగ్గుతో అవమానం పాలవుతుంది. మిగిలిన వారిని తమ శత్రువుల ఎదుట కత్తిపాలు చేస్తాను. ఇది యెహోవా వాక్కు. 1
Luke 16:25దానికి జవాబుగా అబ్రాహాము, ‘నాయనా, గుర్తుందా? నువ్వు జీవించి ఉన్నప్పుడు నీకిష్టమైన వాటిని నువ్వు అనుభవించావు. అప్పుడు లాజరు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇప్పుడు ఇక్కడ అతడు సేద దీరుతున్నాడు. నువ్వు యాతన పడుతున్నావు.