Ecclesiastes 9:3
అందరికీ ఒకే విధంగా జరగడం అనేది సూర్యుని కింద జరిగే వాటన్నిటిలో బహు దుఃఖకరం. మనుషుల హృదయం చెడుతనంతో నిండిపోయింది. వారు బతికినంత కాలం వారి హృదయంలో మూర్ఖత్వం ఉంటుంది. ఆ తరువాత వారు చనిపోతారు. ఇది కూడా దుఃఖకరం.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 8:21యెహోవా ఆ ఇంపైన వాసన ఆస్వాదించి “వారి హృదయాలు బాల్యం నుంచే దుష్టత్వం వైపు మొగ్గుచూపాయి. ఇక ఎప్పుడూ మనుషులను బట్టి భూమిని కీడుకు గురిచేయను. నేనిప్పుడు చేసినట్టు ప్రాణం ఉన్నవాటిని ఇకపై ఎన్నడూ నాశనం చెయ్యను.
Job 15:16అలా ఉండగా, మనుషులు మరింత దుర్మార్గులు. వాళ్ళు నీచులు, దుష్టకార్యాలు చేసేవాళ్ళు, అన్యాయాన్ని నీళ్ళు తాగినట్టు తాగేవాళ్లు. 1
Psalms 51:5ఇదిగో, నేను పాపంలో పుట్టాను. నా తల్లి నన్ను గర్భం ధరించిన క్షణంలోనే నేను పాపంలో ఉన్నాను. + 51:5 ఇదిగో, నేను పాపంలో పుట్టాను. నా తల్లి నన్ను గర్భం ధరించిన క్షణంలోనే నేను పాపంలో ఉన్నాను. క్రైస్తవులు చాలా మంది ఈ వచనాన్ని పొరపాటుగా అర్థం చేసుకుంటారు. నా తల్లి పాపంలో నన్ను గర్భం దాల్చింది అంటే, ఆమె పాపం చేయడం మూలంగా నేను పుట్టాను అనుకుంటారు. అంటే తల్లి, తండ్రి నన్ను కనడం కోసం చేసే లైంగిక క్రియ పాపం అనే అభిప్రాయంలో ఉంటారు. భార్యాభర్తల మధ్య జరిగేది ఒక్కనాటికీ పాపం ఎంతమాత్రం కానేరదు. పరిశుద్ధ వివాహం చేసుకున్న వారి మధ్య లైంగిక క్రియ పవిత్రం. స్త్రీ సాంగత్యం వలన అపవిత్రం కాని వారు అని ప్రకటన 14:4 లో రాసి ఉన్న దాన్ని కూడా ఈ విధంగానే అపార్థం చేసుకుంటారు. దీన్నిబట్టి పెళ్లి చేసుకున్న వారు తప్పనిసరిగా అపవిత్రులేననీ, పవిత్రంగా ఉండడం అంటే బ్రహ్మచారిగా కన్యగా ఉండిపోవడం అనీ భావిస్తారు. పరిశుద్ధ వివాహంలో జత అయిన వారిని వివాహ సంబంధం ఎంత మాత్రం అపవిత్రులుగా చెయ్యదు. అలాగైతే దేవుడు వివాహాన్ని నియమించే వాడే కాదు. ఈ వచనానికి అర్థం నేను తల్లి కడుపులో పడిన క్షణం నుంచీ పాపినే అని. 1
Proverbs 14:32కీడు కలిగినప్పుడు తమ చెడ్డ పనుల వల్ల భక్తిహీనులు నశిస్తారు. నీతిమంతునికి సత్య + 14:32 సత్య మరణ సమయంలో కూడా ఆశ్రయం దొరుకుతుంది.
Ecclesiastes 2:14జ్ఞాని కళ్ళు అతని తలలో ఉన్నాయి. బుద్ధిహీనుడు చీకటిలో నడుస్తాడు. 2 అయినా అందరి గమ్యం ఒక్కటే అని నేను గ్రహించాను. 2
Ecclesiastes 8:11చెడు పనికి తగిన శిక్ష వెంటనే కలగకపోవడం చూసి మనుషులు భయం లేకుండా చెడ్డ పనులు చేస్తారు.